గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 18:55:43

కొండ‌చరియ విరిగిప‌డి తెగిపోయిన జాతీయ ర‌హ‌దారి

కొండ‌చరియ విరిగిప‌డి తెగిపోయిన జాతీయ ర‌హ‌దారి

కోల్‌క‌తా: ప‌శ్చిమ‌బెంగాల్‌లో నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం వ‌ల్ల గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌ర్వ‌త ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతూ వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లుగుతున్న‌ది. సోమ‌వారం రాత్రి కూడా డార్జిలింగ్ జిల్లా, కుర్సియోంగ్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని లోయర్ ప‌గ్ల‌ఝోరాలో భారీ కొండ‌చ‌రియ విరిగిప‌డింది. దీంతో కొండ దిగువ భాగంలో ఒక‌‌టికి ఒక‌టి స‌మాంత‌రంగా ఉన్న జాతీయ ర‌హ‌దారి, రైల్వే ట్రాక్ రెండూ ధ్వంస‌మ‌య్యాయి.  

కొండ‌చ‌రియ ప‌డిన ప్రాంతంలో 55వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారి పూర్తిగా తెగిపోయింది. డార్జిలింగ్, హిమాల‌య‌న్ రైల్వే ట్రాక్ కూడా బాగా దెబ్బ‌తిన్న‌ది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన జిల్లా అధికారులు ర‌హ‌దారిపైకి వ‌చ్చే వాహ‌నాల‌ను దారిమ‌ళ్లించారు. డార్జిలింగ్ హిమాల‌య‌న్ రైల్వే ట్రాక్‌పై రైళ్ల రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. ర‌హ‌దారిని, రైల్వే ట్రాక్‌ను వేగంగా పున‌రుద్ధ‌రించేందుకు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.         


      ‌ logo