ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 11:58:45

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి చుక్కెదురు

రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి చుక్కెదురు

చెన్నై : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం, పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ‌పై జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌(ఎన్జీటీ) చెన్నై ధ‌ర్మాస‌నం తీర్పు వెల్ల‌డించింది. ఈ ప్రాజెక్టుల‌ నిర్మాణానికి ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు తీసుకోవాల్సిందేన‌ని ఎన్జీటీ స్ప‌ష్టం చేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు తీసుకోవాల‌ని ఆదేశించింది. తాగునీటితో పాటు సాగునీటి అవ‌స‌రాలు కూడా ఉన్నాయ‌ని ఎన్జీటీ అభిప్రాయ‌ప‌డింది. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్ద‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి రాసిన లేఖ విష‌యాన్ని ఎన్జీటీ గుర్తు చేసింది.