బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 09:03:33

ఎన్‌ఈపీతో విద్యార్థులకు కొత్త అవకాశాలు : జామియా వీసీ

ఎన్‌ఈపీతో విద్యార్థులకు కొత్త అవకాశాలు : జామియా వీసీ

న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానం ఉన్నత విద్యారంగంలో విద్యార్థులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని జామియా మిల్లియా ఇస్లామియా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ నజ్మా అక్తర్‌ తెలిపారు. అంతరాయం లేని అభ్యసన వాతావరణంలో విద్యను మరింత సరళత్వంతో కొనసాగించవచ్చని, తమ కెరీర్ ఎంపిక ప్రకారం ప్రవేశించవచ్చు.. నిష్క్రమించవచ్చు.. తిరిగి ప్రవేశించవచ్చు అని చెప్పారు. జాతీయ విద్యావిధానం అద్భుతమైందని, ఉన్నత విద్య ఇప్పుడు సంపూర్ణ, బహుళ క్రమశిక్షణతో సైన్స్ ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌పై దృష్టి కేంద్రీకరిస్తుందని పేర్కొన్నారు. అన్ని ఉన్నత విద్యాసంస్థలకు ఒకే రెగ్యులరేటర్‌ ఒక గొప్ప ఆలోచన అన్నారు. ఇది అప్రోచ్‌, ఉద్దేశం యొక్క సమన్వయాన్ని తీసుకు వస్తుందని చెప్పారు. ఇది భారతదేశంలో విద్య యొక్క విజన్‌ను సాకారం చేస్తుందని తెలిపారు. ఎన్‌పీఈలో కొత్త టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించడం ద్వారా దేశంలో డిజిటల్ లెర్నింగ్‌ను పెంచనున్నారని పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo