శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 18:00:52

92.32శాతానికి జాతీయ కొవిడ్‌ రికవరీ రేటు

92.32శాతానికి జాతీయ కొవిడ్‌ రికవరీ రేటు

న్యూఢిల్లీ : దేశంలో పాజిటివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య 84లక్షలు దాటింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 77.65లక్షలకు చేరుకుంది. దీంతో జాతీయ రికవరీ రేటు 92.32శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది. దేశంలో మహమ్మారి కేసులు 84,11,724కు పెరిగాయి. ఒకే రోజు 47,638 కొత్త పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. కొత్తగా మరో 670 మంది మహమ్మారికి బలి కాగా.. ఇప్పటి వరకు 1,24,985 మృత్యువాత పడగా.. మరణాల రేటు 1.49శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటి వరకు 77,65,966 కోలుకొని ఇండ్లకు వెళ్లారని మంత్రిత్వశాఖ తెలిపింది. క్రియాశీల కరోనా కేసుల సంఖ్య వరుసగా ఎనిమిదో రోజు ఆరు లక్షల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 5,20,773 యాక్టివ్‌ కేసులున్నాయని, కేస్‌లోడ్‌లో 6.19 శాతమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.