సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 12:42:23

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా మ‌ర‌ణాలు

దేశంలో త‌గ్గుతున్న క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు క్ర‌మంగా త‌గ్గ‌తున్న‌ద‌ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధ‌వారం వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.51 శాతానికి దిగి వ‌చ్చింద‌ని తెలిపింది. దేశంలోని 14 రాష్ట్రాలు/కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ క‌రోనా చావుల రేటు మరింత త‌క్కువ‌గా అంటే ఒక శాతం కంటే త‌క్కువ‌గా ఉన్న‌దని పేర్కొన్న‌ది. అదేవిధంగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వ‌రుస‌గా రెండోరోజు 7.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పింది. కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలు ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. 

దేశ‌వ్యాప్తంగా క‌రోనా రిక‌వ‌రీ రేటు కూడా వేగంగా 89 శాతం ద‌రిదాపుల్లోకి చేరింద‌ని, కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 88.81 శాతంగా ఉంద‌ని పేర్కొన్న‌ది. ఆ మొత్తం రిక‌వ‌రీల్లో 77 శాతం రిక‌వ‌రీలు కేవ‌లం 10 రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచే న‌మోద‌య్యాయ‌ని చెప్పింది. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశంలో 717 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాగా అందులో 82 శాతం మ‌ర‌ణాలు 10 రాష్ట్రాలు/‌కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయ‌ని, మ‌హారాష్ట్ర (213), క‌ర్ణాట‌క (66)ల నుంచి 29 శాతం మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.