శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 21:32:59

36 రోజుల్లో స్వాస్థ్‌ వాయు వెంటిలేటర్ల సృష్టి

36 రోజుల్లో స్వాస్థ్‌ వాయు వెంటిలేటర్ల సృష్టి

బెంగళూరు: కరోనా వ్యాధిగ్రస్థుల కోసం బెంగళూరులోని నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీస్‌ రికార్డు సమయంలో అత్యంత భద్రమైన వెంటిలేటర్‌ను తయారుచేసింది. స్వాస్థ్‌ వాయు పేరుతో పిలుస్తున్న ఈ  వెంటిలేటర్‌ను కేవలం 36 రోజుల్లోనే తయారుచేసినట్లు సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఏఎల్‌ డైరెక్టర్‌ జితేంద్ర జాదవ్‌ తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్‌ఏఎల్‌ సాంకేతిక, వైద్యనిపుణులు ఈ వెంటిలేటర్‌ను తయారుచేసినట్లు ఆయన చెప్పారు. దీని వాడకం కూడా  చాలా సులువని, ఖర్చు కూడా తక్కువగా  ఉంటుందన్నారు. దవాఖానలు, డిస్పెన్సరీల్లోనే కాకుండా ఇండ్లలో కూడా  ఈ  వెంటిలేటర్‌ను వాడొచ్చని, దీనిని త్వరలోనే ప్రభుత్వ గుర్తింపు కోసం పంపనున్నట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రైవేటు సంస్థలతో కలిసి భారీ  ఎత్తున ఉత్పత్తి చేయాలని ఎస్‌ఏఎల్‌ భావిస్తున్నది.


logo