గురువారం 26 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 11:03:44

ముస్సోరీలో 33 మంది ట్రైనీల‌కు క‌రోనా పాజిటివ్‌

ముస్సోరీలో 33 మంది ట్రైనీల‌కు క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్‌: ఉత్త‌రాఖండ్‌లోని లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్‌లో ఉన్న 33 మంది ట్రైనీల‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  దీంతో ముస్సోరీలో ఉన్న ఐఏఎస్ అకాడ‌మీని రెండు రోజుల పాటు మూసివేశారు.  క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లో 33 మంది ట్రైనీలు పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు ద్రువీక‌రించారు. భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు తేల‌డంతో.. హోట‌ళ్లు, మెస్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, లైబ్ర‌రీని శానిటైజ్ చేశామ‌ని అకాడ‌మీ డైర‌క్ట‌ర్ సంజీవ్ చోప్రా తెలిపారు.