గురువారం 16 జూలై 2020
National - Jun 17, 2020 , 12:43:42

సైనికుల త్యాగం దేశం మ‌రిచిపోదు : రాజ్‌నాథ్ సింగ్‌

సైనికుల త్యాగం దేశం మ‌రిచిపోదు :  రాజ్‌నాథ్ సింగ్‌

హైద‌రాబాద్‌: సైనికుల త్యాగాల‌ను, ధైర్యాన్ని దేశం ఎన్న‌డూ మ‌రిచిపోదు అని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  గాల్వ‌న్ వ్యాలీలో 20 మంది సైనికులు మృతిచెందిన ఘ‌ట‌న‌పై ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.  గాల్వ‌న్ దాడిలో చ‌నిపోయిన సైనికుల కుటుంబాల‌కు సానుభూతి ప్ర‌క‌టించారు. క్లిష్ట స‌మ‌యంలో దేశం అంతా క‌లిసి క‌ట్టుగా ఉన్న‌ద‌న్నారు. భార‌తీయ బ్రేవ్‌హార్ట్స్ ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌న్నారు.  గాల్వ‌న్‌లో సైనికులు చ‌నిపోవ‌డం బాధాక‌రం అని అన్నారు. ఆ ఘ‌ట‌న చాలా క‌లిచివేసింద‌న్నారు.  స‌రిహ‌ద్దు విధుల్లో మ‌న సైనికులు అత్యంత ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  అత్యున్న‌త స్థాయిలో సైనికులు త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశార‌ని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. logo