ముంబై: నటాషా పూనావాలా తెలుసు కదా. సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా భార్య ఆమె. క్యూటీ నటాషాకు వెరైటీ వెరైటీ బ్యాగ్‌లు అంటే ఇష్టం. వాటి కోసం ఆమె ఎంతైనా ఖర్చు చేస్తుంది. హ్యాండ్‌బ్యాగ్స్ ఎంత ధర ఉన్నా.. అది తన చేతిలో ఉండాల్సిందే. ఇక ఇటీవల వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌లను నటాషా వీక్షించింది. ఆ టోర్నీ చూసేందుకు ఆమె ఓ ఖరీదైన బ్యాగ్‌తో వెళ్లింది. హెర్మిస్ కంపెనీకి చెందిన ఆ హ్యాండ్‌బ్యాగ్ ఖరీదు అక్షరాల 82 లక్షలు. వింబుల్డన్ వద్ద బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాతో ఆమె ఫోటోకు ఫోజులిచ్చింది. అప్పుడే ఆ కాస్ట్లీ బ్యాగ్ కనిపించింది. హెర్మిస్ బిర్కిన్ ఫాబోగ్ బ్యాగ్‌ల కలెక్షన్ నటాషా వద్దే చాలానే ఉన్నాయట.