మంగళవారం 26 జనవరి 2021
National - Dec 24, 2020 , 18:24:23

కాంగ్రెస్సే ‘రాహుల్‌’ను సీరియస్‌గా తీసుకోవట్లేదు..

కాంగ్రెస్సే ‘రాహుల్‌’ను సీరియస్‌గా తీసుకోవట్లేదు..

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ఏం చెప్పినా, ఆయనను ఆ పార్టీ నేతలే సీరియస్‌గా తీసుకోవట్లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో రైతులను కలుసుకున్నారు. తర్వాత తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘కేంద్ర వ్యవసాయ చట్టాలపై రాహుల్‌ ఈ రోజు రాష్ట్రపతిని కలిసి నిరసన తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి

రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. నన్ను కలిసిన రైతులు నాతో మాట్లాడుతూ ఏ కాంగ్రెస్‌ నాయకుడు తమ వద్దకు వచ్చి సంతకాలు తీసుకోలేదని చెప్పారు’ అని అన్నారు. 

రైతులకు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. రాహుల్‌కు ఏమైనా చేయాలనిపిస్తే రైతులకు మేలు చేయాలన్నారు. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీ రైతుల వ్యతిరేకుల పార్టీ అని వ్యాఖ్యానించారు. తనను కలిసిన రైతులు కూడా ఆందోళనకారుల ఒత్తిడికి తలొగ్గి, కేంద్ర వ్యవసాయ చట్టాలకు సవరణ చేయొద్దని కోరారని తోమర్‌ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo