బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 16:30:20

అసోంలో నూత‌న వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ప్రారంభం

అసోంలో నూత‌న వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ప్రారంభం

గువాహ‌టి: అసోం నూత‌న వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ప్రారంభ‌మైంది. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఆ సంస్థ‌ను ప్రారంభించారు. అసోంలోని యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) పేరుతో నూత‌న సంస్థ‌ను నెల‌కొల్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న‌ల‌ను మ‌రింత ప్రోత్స‌హించ‌డం కోసం నూత‌న వ్య‌వ‌సాయ ప‌రిశోధన సంస్థ‌ను ఏర్పాటు చేశామ‌ని మంత్రి తోమ‌ర్ తెలిపారు. 

ఈ నూత‌న వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ అసోంతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, మేఘాల‌యా, మ‌ణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర‌, సిక్కిం రాష్ట్రాల్లో వ్య‌వ‌సాయ సంబంధ ప‌రిశోధ‌న‌ల‌కు తోడ్ప‌డుతుంద‌ని కేంద్ర‌మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ వెల్ల‌డించారు. 2050 క‌ల్లా దేశ జ‌నాభా మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని, అప్ప‌టి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా అధిక దిగుబ‌డిని ఇచ్చే నూత‌న వంగ‌డాల‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం ఉన్న‌దని, అందుకు కొత్త‌గా ప్రారంభ‌మైన వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న సంస్థ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo