గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 16:07:48

సరిగ్గా 28 ఏండ్ల తర్వాత అయోధ్యకు మోదీ

సరిగ్గా 28 ఏండ్ల తర్వాత అయోధ్యకు మోదీ

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమం వేదికపై మోదీతోపాటు కేవలం ఐదుగురికే చోటు ఉంటుందని రామాలయ తీర్థ ట్రస్ట్ ప్రకటించింది. సరిగ్గా 28 ఏండ్ల తర్వాత రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు వస్తున్నారు. 

1992 లో జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలంటూ కన్యాకుమారి నుంచి నరేంద్ర మోదీ తిరంగా యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల మీదుగా యాత్రను కొనసాగించిన మోదీ.. జనవరి 18న ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. ఫైజాబాద్ సమీపంలోని మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఆనాటి బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి హాజరయ్యారు. సమావేశం మరుసటి రోజున  జోషి అయోధ్యలోని రామ్ లాలా ను సందర్శించడం తటస్థించింది. ఆయన వెంట మోదీ కూడా రామ్ లాలా దర్శించుకుని.. శ్రీరాముడి ఆలయం నిర్మించే సమయంలో మరోసారి అయోధ్య వస్తానని ఆరోజు చెప్పాడు. 

28 ఏండ్ల క్రితం చెప్పినట్లుగానే ఆలయం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు రెండో సారి అయోధ్యకు మోదీ వస్తున్నారని, నిజంగా నమ్మశక్యంగా లేదు.. అని మోదీతో కలిసివున్న జోషి ఫొటో తీసిన సీనియర్ జర్నలిస్ట్ మహేంద్ర త్రిపాఠి అన్నారు. 

తాజావార్తలు


logo