ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 23, 2020 , 06:40:48

వేడెక్కనున్న బిహార్‌ ఎన్నికల ప్రచారం.. ప్రసంగించనున్న మోదీ

వేడెక్కనున్న బిహార్‌ ఎన్నికల ప్రచారం.. ప్రసంగించనున్న మోదీ

పాట్నా :  బిహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఎన్‌డీఏ స్టార్‌ క్యాంపెయినర్‌, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ్టి నుంచి ప్రచారం చేయనున్నారు. సాసరం, గయా, భగల్పూర్‌లో గయాలో జరిగే సభల్లో ప్రసంగిస్తారని బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్రసింగ్‌ ఫడ్నవీస్‌ తెలిపారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 28న, నవంబర్‌ 3, 7న తేదీల్లో మూడు విడుతల్లో జరుగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో 12 ర్యాలీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారని ఫడ్నవిస్‌ తెలిపారు. సీఎం నితీశ్‌కుమార్‌, ఎన్‌డీఏ పార్టీ నేతలు మోదీ ప్రసంగాన్ని వీక్షించేందుకు హాజరవుతారని చెప్పారు.. 28న దర్బాంగా, ముజఫర్‌పూర్‌, పాట్నా, నవంబర్‌ 1న చప్రా, తూర్పు చంపారన్, సమస్తిపూర్‌, 3న పశ్చిమ చంపారన్, సహర్సా, ఫోర్బెస్‌జంగ్‌లలో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని ఫడ్నవీస్‌ చెప్పారు. మైదానాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని ఫడ్నవీస్ తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో సామాజిక దూర ప్రమాణాలు పాటించడం, ర్యాలీల్లో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించేలా చూస్తామని, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.