మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 18:45:55

డ్రగ్స్‌ను నిరోధించడం ఎన్సీబీ పని.. ప్రశ్నించడం కాదు..

డ్రగ్స్‌ను నిరోధించడం ఎన్సీబీ పని.. ప్రశ్నించడం కాదు..

ముంబై: మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడమే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పని అని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. అయితే ఎన్సీబీ మాత్రం ఒకరి తర్వాత మరొకరిని పిలిచి ప్రశ్నిస్తున్నదని ఆయన విమర్శించారు. సుశాంత్‌ మరణం కేసులో ఎలాంటి తప్పును సీబీఐ గుర్తించలేక పోయిందని అందుకే ఎన్సీబీ బాలీవు‌డ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నదని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. డ్రగ్స్‌ రాకెట్‌ను పట్టుకోవడం, దేశంలోకి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం ఎన్సీబీ పని ఆయన అన్నారు. దీనికి బదులుగా సుశాంత్‌ కేసులో ఒకరి తర్వాత మరొకరిని ప్రశ్నిస్తూ పోతున్నదని విమర్శించారు. ఏ రంగంలో వ్యసనం లేదు? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. కొందరు డబ్బుకు బానిస అయితే మరికొందరికి ఇతర వ్యసనాలు ఉంటాయని అన్నారు. ఇలాంటి కేసుల దర్యాప్తునకు ప్రతి రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉన్నదని సంజయ్‌ రౌత్‌ చెప్పారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo