గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 00:24:28

2,600 ఏండ్ల నాటి పెయింటింగ్‌లో నానో మెటీరియల్స్‌

2,600 ఏండ్ల నాటి పెయింటింగ్‌లో నానో మెటీరియల్స్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత పురాతన, మానవ నిర్మితమైన నానో మెటీరియల్స్‌ను(అతితక్కువ పరిమాణంలో వాడే రసాయన పదార్థాలు/వస్తువులు) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తమిళనాడులోని కీలాదీలో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన కుండల పెంకులపై ఉన్న ప్రత్యేకమైన పెయింటింగ్‌లో వీటిని గుర్తించారు. ఈ పెయింటింగ్‌ 2,600 ఏండ్ల నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్‌ నానో ట్యూబ్స్‌ను ఉపయోగించి ఈ పెయింటింగ్స్‌ తయారు చేశారని వివరించారు.