శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 09:00:41

అసెంబ్లీకి వెళ్లిన నిండు గర్భిణి ఎమ్మెల్యే

అసెంబ్లీకి వెళ్లిన నిండు గర్భిణి ఎమ్మెల్యే

ముంబయి : చాలా మంది ఎమ్మెల్యేలు.. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం నిండు గర్భిణి అయినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించేందుకు ఆమె చిత్తశుద్ధితో సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని బీద్‌ నియోజకవర్గం నుంచి నమిత ముందాద(30) అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం నమిత 8 నెలల గర్భవతి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. గర్భిణి అయి కూడా ఆమె శాసనసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నమితను మీడియా పలుకరించింది. అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి.. ఈ సభకు హాజరు కావడం తన విధి, బాధ్యత అని నమిత పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. వాటిని సభలో లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తనకు ఇబ్బంది ఉన్నప్పటికీ సభకు హాజరయ్యానని నమిత చెప్పారు. తనకు కూడా ఇతర గర్భిణిల లాగే సమస్యలు ఉన్నాయి. కానీ ప్రజలు ముఖ్యం కాబట్టి.. డాక్టర్ల సలహాలు పాటిస్తూ అసెంబ్లీకి వచ్చానని నమిత తెలిపారు. 


logo