బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 13:13:53

అయోధ్య రామయ్య ఆలయ భూమిపూజ ఆహ్వానపత్రిక ఇదే..

అయోధ్య రామయ్య ఆలయ భూమిపూజ ఆహ్వానపత్రిక ఇదే..

అయోధ్య : ఈ నెల 5న అయోధ్యలో రామాలయం భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ చేయనుండగా, సమయం దగ్గరపడుతున్న కొద్ది సమాచారం బయటకు వస్తోంది. భూమిపూజ కోసం అతిథులకు పంపిన ఆహ్వాన లేఖ ఒకటి బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం.. భూమిపూజ కోసం 200 మంది అతిథులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ అతిథులకు పసుపు వర్ణంలో కూడిన ఆహ్వానాన్ని పంపుతోంది. ఇందులో ప్రధాని మోడీ రాకపై కూడా సమాచారం ముద్రించారు. అతిథులంతా ఆగస్టు 4న సాయంత్రం నాటికే అయోధ్యకు చేరుకోవాలని ఆహ్వానపత్రికలో కోరారు.

ఇప్పటికే కార్యక్రమానికి హాజరయ్యే కొంత మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, బీజేపీ నాయకురాలు ఉమాభారతి, ఆలయ ఉద్యమంతో సంబంధం ఉన్న సాధ్వీ రితాంభర, బాబ్రీ మసీద్‌కు చెందిన ఇక్బాల్‌ అన్సారీ, రాజేంద్ర దేవచార్య తదితరుల పేర్లు వినస్తున్నాయి. కాగా, ఆగస్టు 5న మోడీ మొదట ఉదయం 11.15గంటలకు సాకేత్‌ కాలేజీకి వచ్చి, అక్కడి నుంచి హనుమాన్‌ గార్హి ఆలయానికి వెళ్తారు. అనంతరం భూమిపూజ కోసం రామ జన్మభూమికి వెళ్తారు. అనంతరం మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo