e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News న‌లంద వ‌ర్సిటీ.. పీజీ కోర్సుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

న‌లంద వ‌ర్సిటీ.. పీజీ కోర్సుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

న‌లంద వ‌ర్సిటీ.. పీజీ కోర్సుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

పాట్నా : నలంద విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో(2021) ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రవేశ ప్రక్రియ కోసం nalandauniv.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్ర‌వేశ ప్ర‌క్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జ‌ర‌గ‌నుంది. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపి స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (SoP), స్వీయ పరిచయ నోట్‌తో పాటు సమర్పించాలి. వ‌ర్సిటీ విడుదల చేసిన ప్రవేశ మార్గదర్శకాల ప్రకారం.. అన్ని కోర్సులు ఇంగ్లీష్‌లోనే ఉంటాయి కావునా అభ్య‌ర్థులు ఆంగ్ల భాషలో ఉన్నతస్థాయి సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. TOEFL, IELTS, TOEIC, PTE, STEP ఆంగ్ల భాషా పరీక్ష స్కోర్‌లు అంగీకరించబడతాయి.

దరఖాస్తు ప్రక్రియ..

భారతీయ పౌరులు అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారం, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ) ను [email protected] కు సమర్పించాలి. దరఖాస్తు రుసుము రూ. 500. దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత లావాదేవీ ఐడీ లేదా బదిలీ వివరాలను [email protected] వద్ద అడ్మిషన్స్ కార్యాలయానికి సమర్పించాలి. తెలియజేసిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అదే విదేశీ విద్యార్థులు నింపిన దరఖాస్తు ఫారం, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ) తో పాటు సంబంధిత‌ అన్ని పత్రాలను [email protected] కు పంపాలి. అభ్యర్థి ఫీజు 8 డాల‌ర్లుగా ఉంది.

మాస్టర్స్ కార్యక్రమానికి అర్హత ప్రమాణాలు..

  • అభ్యర్థి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా 2.2 / 4.0 జీపీఏ లేదా సమానమైన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) సాధించి ఉండాలి.
  • అభ్యర్థులు సెల్ఫ్ ఇంట్రడక్షన్ / బయో నోట్ స్టేట్‌మెంట్ (250 పదాలకు మించకూడదు) సమర్పించాలి
  • అభ్యర్థులు ఈ క్రింది వాటిపై స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (SoP) ను సమర్పించాల్సి ఉంటుంది. మీరు నలంద విశ్వవిద్యాలయంలో ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు (100 పదాలు). ఈ ప్రోగ్రామ్ ఎంచుకోవడానికి గల కారణాలు (300– 500 పదాలు).
  • ఇత‌ర దేశాల నుండి వచ్చే విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రావీణ్యం రుజువు అవసరం.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న‌లంద వ‌ర్సిటీ.. పీజీ కోర్సుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement