గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 13:31:04

హిజ్బుల్ చీఫ్ కొత్త క‌మాండ‌ర్‌గా సైఫుల్లా...

హిజ్బుల్ చీఫ్ కొత్త క‌మాండ‌ర్‌గా సైఫుల్లా...

జ‌మ్ముక‌శ్మీర్‌: భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూ అత‌డి అనుచ‌రుడితో స‌హా హ‌త‌మైన సంగ‌తి తెలిపిందే. రియాజ్ నైకూ స్థానికుడు కావ‌డంతో స్థానిక యువ‌కుల్లో మంచి ప‌ట్టుంది. దీంతో అల్ల‌ర్లు చెల‌రేగుతాయ‌ని భావించిన అధికారులు శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం క‌శ్మీర్ లోయ‌లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు విధించారు. సెక్యూరిటీ సిబ్బందిని భారీగా మోహ‌రించారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ను ప్ర‌భుత్వం క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌గా, దానికి తోడు అద‌న‌పు ఆంక్ష‌లు విధించిన‌ట్లు అధికారులు తెలిపారు.

 లోయ‌లో మొబైల్ ఫోన్ సేవలు, ఇంట‌ర్‌నెట్ సేవ‌లు నిలిపివేశారు. రియాజ్ నైకూ స్థానంలో హిజ్బుల్ క‌మాండ‌ర్‌గా సైఫుల్లా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ట్లు స‌మాచారం. స్థానికుల ద్వారా విష‌యం తెలుసుకున్న బ‌ల‌గాలు అత‌ని కోసం వేట‌ను ప్రారంభించాయి. ద‌క్షిణ క‌శ్మీర్‌లో సైఫుల్లా క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాదిగా భ‌ద్ర‌తా బ‌ల‌గాల లిస్టులో ఉన్నాడు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో గాయ‌ప‌డిన తీవ్ర‌వాదుల‌కు చికిత్స అందించే బాధ్య‌త సైఫుల్లా చూసేవాడు. 


logo