నాగాలాండ్ పర్యాటకులను ఈ నెల 27 నుంచి అనుమతి

గౌవాహతి : నాగాలాండ్‌లోకి పర్యాటకులకు ఈ నెల 27 నుంచి అనుమతించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తొమ్మిది నెలల తరువాత పర్యాటకులు వచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తున్నది. మొదటి దశలో రాష్ట్రంలో పర్యాటక రంగం తిరిగి తెరవడం డిసెంబర్ 27 నుండి దేశీయ పర్యాటకులకు మాత్రమే ఉంటుందని, దిమాపూర్ నుంచి రహదారి, రైలు, వాయు రవాణా ద్వారా ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే ఉంటుందని నాగాలాండ్ రాష్ట్ర పర్యాటక విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 18 న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 22 న జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. నాగాలాండ్ సందర్శించాలనుకునే పర్యాటకులు.. ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) పొందవలసి ఉంటుంది. “మొదటి దశలో, పర్యాటకుల కోసం www.ilp.nagaland.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే ఐఎల్పీ అందుబాటులో ఉంటుంది. ప్రతి పర్యాటకుడు నాగాలాండ్ రావడానికి మూడు రోజుల ముందు కొవిడ్ -19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ కలిగి ఉండాలి. పరీక్ష తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్ లేదా సీబీఎన్ఏఏటీ CBNAAT చేత చేయించాలి. కొవిడ్ -19 పరీక్షలకు పాజిటివ్ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తగినదిగా పరిగణించబడదు” అని రాష్ట్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్లో తెలిపింది. నాగాలాండ్‌లో పర్యాటకుల ప్రయాణ / సందర్శనలను ముందుగా బుక్ చేసుకున్న / ప్యాకేజీ పర్యటనలకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నది.
రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులందరికీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ను జారీ చేసింది. పర్యాటకులందరికీ కరోనా వైరస్ నెగెటివ్ పరీక్ష నివేదిక హార్డ్ కాపీని వెంట ఉంచుకోవాలని, అధికారులు అడిగినప్పుడు చూపాల్సి ఉంటుందని పేర్కొన్నది. పర్యాటకులు రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆరోగ్య, భద్రతా ప్రోటోకాల్స్, మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. నాగాలాండ్‌లో ఇప్పటివరకు 11,866 కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,244 మంది రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 417 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్‌తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత