ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 20:15:00

ఒకే చెక్కపై గ్రామాన్ని చెక్కేశాడు..!

ఒకే చెక్కపై గ్రామాన్ని చెక్కేశాడు..!

కొహిమా: అతనో శిల్పి. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. కుండలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ, తన కళను మాత్రం పక్కనపెట్టలేదు. అప్పు తెచ్చుకొని మరీ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఒక చెక్కపై గ్రామ దృశ్యాన్ని మొత్తం చెక్కేసి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

నాగాలాండ్‌కు చెందిన నింగ్వాన్ జింగ్‌ఖైకు చెక్కతో అందమైన ఆకృతులు చెక్కడం అంటే ఇష్టం. ఒక చెక్క బల్లపై నమ్మశక్యంకాని రీతిలో విశాలమైన గ్రామ దృశ్యాన్ని చెక్కాడు. గుడిసెలు, జలపాతం, లైట్లు, వంతెన, జలపాతం ఇలా అన్నింటిని అందులో చెక్కాడు. దానిని  గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్‌గా మార్చేశాడు. ఇదంతా పూర్తిచేయడానికి అతడికి ఏడాది పట్టిందట. రూ .1.70 లక్షలు ఖర్చయింది. దీన్ని చూసినవారంతా అబ్బురపడుతున్నారు. ఇతడి ప్రతిభకు జాతీయస్థాయి పత్రికలు అక్షరరూపం ఇవ్వడంతో ఇప్పుడతడు ఫేమస్‌ అయిపోయాడు. ఆ కళాఖండాన్నిరూ .20 లక్షలకు అమ్మి, ఆ మొత్తాన్ని తన కుటుంబ పోషణం కోసం ఉపయోగించుకుంటానని జింగ్‌ఖై చెబుతున్నాడు. భవిష్యత్తులో ఉక్రుల్ జిల్లాలోని ఫాంగ్రే పీఠభూమి వద్ద 100x50 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న యేసుక్రీస్తు, అతడి 12 మంది శిష్యుల ప్రకృతి దృశ్యాన్ని చెక్కపై చెక్కాలనేది తన కల అని పేర్కొన్నాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo