మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 20:46:18

నాగాలాండ్‌లో కుక్క మాంసంపై నిషేధం!

నాగాలాండ్‌లో కుక్క మాంసంపై నిషేధం!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో నాగాలాండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  కుక్క మాంసంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నాగాలాంగ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కుక్క మాంసాన్ని తినడం శతాబ్దాలుగా ఆచారంగా సాంప్రదాయంగా వస్తుందని అంటున్నారు. ప్ర‌భు‌త్వం తీసుకున్న నిర్ణ‌యం నాగాలాండ్ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు విరుద్ధంగా ఉన్న‌ద‌ని మండిప‌డుతున్నారు. 

ప్రజల ఆచారవ్యవహారాలను కాలరాసే అధికారం ప్రభుత్వాలకు ఎక్క‌డిద‌ని నాగా ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా త్వరలో ఓ ఉద్యమాన్ని చేపట్టాలని కూడా నాగాలాండ్‌లోని కొన్ని ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. కాగా, ఇప్ప‌టికే మిజోరం ప్ర‌భుత్వం కూడా ఆ రాష్ట్రంలో కుక్క మాంసంపై నిషేధం విధించింది. ఇదిలావుంటే కుక్క మాంసం నిషేధంపై జంతు ప్రేమికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo