మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 08:54:06

హోంక్వారెంటైన్‌లో నాగాలాండ్ సీఎం

హోంక్వారెంటైన్‌లో నాగాలాండ్ సీఎం

కోహిమా‌: నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. సీఎం ఇంటిని శానిటైజ్ చేసి 48 గంటలపాటు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని మూసివేశారు. ముందుజాగ్రత్త చర్యగా సీఎం కార్యాలయ అధికారులంద‌రు కూడా హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లార‌ని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. 

కాగా, నాగాలాండ్ సీఎం ఇంట్లోని న‌లుగురు సిబ్బందితోపాటు ఆ రాష్ట్రంలో మొత్తం 53 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చింది. కాగా నాగాలాండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం‌ 1,566 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయాని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి పంగన్యూ ఫోమ్ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo