శుక్రవారం 29 మే 2020
National - Mar 31, 2020 , 16:05:42

పీఎం కేర్స్‌కు ఐఎఫ్‌ఎఫ్‌సీవో, ఎన్‌ఏఎఫ్‌ఈడీ రూ. 30 కోట్ల విరాళం

పీఎం కేర్స్‌కు ఐఎఫ్‌ఎఫ్‌సీవో, ఎన్‌ఏఎఫ్‌ఈడీ రూ. 30 కోట్ల విరాళం

ఢిల్లీ : పీఎం కేర్స్‌కు నేషనల్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఏఎఫ్‌ఈడీ) రూ. 5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు అంతే మొత్తంలో గల చెక్కును ఎన్‌ఏఎఫ్‌ఈడీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ చందా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు నేడు అందజేశారు. అదేవిధంగా పీఎం కేర్స్‌కు రూ. 25 కోట్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌(ఐఎఫ్‌ఎఫ్‌సీవో) ప్రకటించింది.  

కరోనాపై పోరుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు అండగా నిలవాల్సిందిగా పేర్కొంటూ ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరిన విషయం తెలిసిందే. పీఎం పిలుపు మేరకు పీఎం కేర్స్‌(ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌)కు పౌరులు, సినీ, వ్యాపార ప్రముఖులు, వివిధ సంస్థలు తమ వంతు సేవగా విరాళాలు ప్రకటిస్తున్నాయి. 


logo