గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 12:35:34

కరోనా ఎఫెక్ట్‌.. బెంగాల్‌ సచివాలయం మూసివేత

కరోనా ఎఫెక్ట్‌.. బెంగాల్‌ సచివాలయం మూసివేత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’ను సోమవారం, మంగళవారం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎస్ఐని 14వ అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో విధుల్లో ఉన్నారని, హౌరా జిల్లా పక్కనే ఉన్న సచివాలయంలో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపడుతారన్నారు. ‘నబన్నా’ అధికారులు, సిబ్బంది సోమ, మంగళవారాల్లో ఇంటి నుంచే పని చేస్తారన్నారు. కాగా, ఎస్‌ఐ భార్యకు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని, ఇద్దరిని రాజర్‌హాట్‌ ప్రాంతంలోని దవాఖానలో చేర్పించారని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బందితో ‘నబన్నా’ పని చేస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ ప్రతి రోజు కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారి పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo