శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:38:14

ఎన్‌95 మాస్క్‌లు ఎందుకు హానిక‌ర‌మంటే..

ఎన్‌95 మాస్క్‌లు ఎందుకు హానిక‌ర‌మంటే..

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ సంక్షోభం నేప‌థ్యంలో జ‌నం అంతా మాస్క్‌లు ధ‌రిస్తున్నారు. అయితే ఎన్‌95 మాస్క్‌లు ధ‌రిస్తున్న వారికి కేంద్రం హెచ్చ‌రిక జారీ చేసింది.  గాలి పీల్చే వాల్వ్‌లు ఉన్న ఎన్‌95 మాస్క్‌లు హానిక‌ర‌మ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  ఇలాంటి మాస్క్‌లు.. వైర‌స్ వ్యాప్తిని నియంత్రించ‌లేవ‌ని ఆరోగ్య‌శాఖ‌కు చెందిన డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీస్‌స్ పేర్కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆరోగ్య  కార్య‌ద‌ర్శుల‌కు, వైద్య విద్యా సంస్థ‌ల‌కు.. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఓ స‌ర్య్యూల‌ర్ జారీ చేసింది. 

దేశ‌వ్యాప్తంగా త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో ఎన్‌95 మాస్క్‌ల‌ను ధ‌రిస్తున్న‌ట్లు ఆరోగ్య శాఖ ఆరోపించింది. హెల్త్ వ‌ర్క‌ర్లు కాకుండా ఇత‌ర ప్ర‌జ‌లు గాలి పీల్చే వాల్వ్ ఉన్న ఎన్‌95 మాస్క్‌లు వాడుతున్న‌ట్లు తెలియ‌జేసింది. అయితే సాధార‌ణ ప్ర‌జ‌లు ఇంట్లో త‌యారు చేసిన ముఖం  మాస్క్‌ల‌ను మాత్ర‌మే వాడాల‌ని డీజీహెచ్ఎస్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. డీజీహెచ్ఎస్ అధిప‌తి రాజివ్ గార్గ్ ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ రాశారు. మాస్క్ రంగుతో ఎటువంటి సంబంధం లేద‌ని ఆరోగ్య‌శాఖ చెప్పింది. కానీ ప్ర‌తి రోజు సాధార‌ణ మాస్క్‌ల‌ను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉతకాల‌ని సూచించింది.  ఉతికేట‌ప్పుడు ఉప్పు వేస్తే మంచిద‌ని పేర్కొన్న‌ది. logo