శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 11:09:32

సీఎం కేసీఆర్‌కు చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్‌కు చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి: సీఎం కేసీఆర్‌ 66వ పుట్టినరోజు నేడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగానే కాగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.logo