శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 10, 2020 , 08:22:05

క‌రోనా ఎఫెక్ట్‌: మూత‌ప‌డ్డ మైసూర్ ప్యాలెస్‌

క‌రోనా ఎఫెక్ట్‌: మూత‌ప‌డ్డ మైసూర్ ప్యాలెస్‌

బెంగ‌ళూరు: కర్ణాటకలోని చారిత్ర‌క మైసూర్ ప్యాలెస్‌ను అధికారులు మూసివేశారు. మైసూర్‌ ప్యాలెస్‌లో పనిచేసే ఉద్యోగి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్యాలెస్‌లో పూర్తిగా శానిటైజేష‌న్ చేసిన త‌ర్వాత సోమవారం తిరిగి తెరిచే అవకాశం ఉంద‌ని వారు చెప్పారు. కాగా, గ‌తంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించిన కొత్త‌లో సైతం మార్చి 15 నుంచి 22 వ‌ర‌కు వారం రోజుల‌పాటు మైసూర్ ప్యాలెస్‌ను మూసివేశారు., 

ఇదిలావుంటే, కరోనా మ‌హ‌మ్మారి కట్టడి కోసం కర్ణాటక ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న‌ది. అయినా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం క‌ర్ణాట‌క‌లో మొత్తం 28,877 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 11,876 మంది ఇప్ప‌టికే వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 16,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మ‌రో 470 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo