శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 18:17:58

సేవలను విస్తరించనున్న మైమనీ మంత్ర

 సేవలను విస్తరించనున్న మైమనీ మంత్ర

బెంగళూరు:  ప్రముఖ ఫైనాన్స్ సర్వీసెస్ మార్కెట్‌ ప్లేస్ మై మనీ మంత్ర డాట్‌ కామ్‌ (ఎంఎంఎం) తన సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. మరిన్నినగరాల్లో ఋణాలు అందించనున్నది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలో 100కు పైగా శాఖల నెట్‌వర్క్‌ కలిగిన మైమనీ మంత్ర ఇప్పుడు వినియోగదారుల సౌకర్యార్ధం ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ ఋణ దరఖాస్తు ఎంపికలను అందిస్తున్నది. మూడు దశాబ్దాలుగా వినియోగదారులకు ఫైనాన్స్ మార్కెట్‌ ప్లేస్ గా సేవలనందిస్తున్న కంపెనీకి 70 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో 100కు పైగా బ్యాంకింగ్‌ భాగస్వాములకు చెందిన సేవలను అందిస్తుంది. వ్యక్తిగత , గృహ, క్రెడిట్‌కార్డు ఋణాలకు సంబంధించి 4 బిలియన్‌ డాలర్లుకు పైగా ఋణాలను అందించడంలో తోడ్పడింది. మైమనీ మంత్ర ఇప్పుడు 3, 4 శ్రేణి నగరాలకు సైతం తన సేవలు విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించింది. మైమనీ మంత్ర డాట్‌ కామ్ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ రాజ్‌ ఖోస్లా మాట్లాడుతూ ‘‘మూడు దశాబ్దాలుగా మేము విజయవంతంగా ఆర్ధికసేవలను వినియోగదారులకు అందిస్తున్నాం ,ఇప్పటి వరకూ 70 లక్షల మంది వినియోగదారులకు సేవలను అందించాం "అని అన్నారు.  లెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ల తో అసుస్‌ ల్యాప్‌టాప్స్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.