ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 15:08:16

నా గేదె బాగోగులు చూసుకోవాలి.. ఆరు రోజులు సెలవివ్వండి..

నా గేదె బాగోగులు చూసుకోవాలి.. ఆరు రోజులు సెలవివ్వండి..

భోపాల్‌: కరోనా నేపథ్యంలో విధులతో అలిసిపోతున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు పలు కారణాలతో సెలవు కోరుతున్నారు. రేవాలోని ప్రత్యేక ఆర్మీ దళంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ వినూత్నంగా సెలవు లేఖ రాశాడు. ‘నా తల్లి గారు గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా ఇంటి వద్ద ఓ గేదె కూడా ఉన్నది. అదంటే నాకు ఎంతో ఇష్టం. నేను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో విజయం సాధించేందుకు దాని పాలు కూడా ఒక కారణం. ఇటీవల ఆ గేదె ఓ దూడకు జన్మనిచ్చింది. దాని రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. నాకు ఆరు రోజులు సెలవు మంజూరు చేస్తే నా తల్లికి చికిత్స చేయించడంతోపాటు గేదె బాగోగులను కూడా చూసుకుంటాను’ అని అందులో పేర్కొన్నాడు.  కాగా పోలీస్‌ కానిస్టేబుల్‌ రాసిన ఈ సెలవు లేఖ చాలా పాపులర్‌ అయ్యింది. మరోవైపు కారణం ఏదైనప్పటికీ సెలవు కోరిన వారికి తప్పక ఇస్తానని ఆ పోలీస్‌ కానిస్టేబుల్‌ పై అధికారి పేర్కొన్నారు. logo