మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 10:34:28

నా తండ్రి ఇంకా బ్ర‌తికే ఉన్నారు : అభిజిత్ ముఖ‌ర్జీ

నా తండ్రి ఇంకా బ్ర‌తికే ఉన్నారు : అభిజిత్ ముఖ‌ర్జీ

కోల్‌క‌తా : మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఇక‌లేర‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ స్పందించారు. త‌న తండ్రి బ్ర‌తికే ఉన్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన కోసం మీ ప్రార్థనలకు కొనసాగించాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేశారు. త‌న తండ్రి ఆరోగ్యంపై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేస్తున్నప్ర‌చారం దేశంలో మీడియా ఫేక్ న్యూస్ క‌ర్మాగారంగా మారిన అంశాన్ని ప్ర‌తిబింబిస్తుంద‌న్నారు. 

ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ఈ ఉద‌యం స్పందిస్తూ... ప్ర‌ణ‌బ్ ఇంకా దీర్ఘ కోమాలోనే ఉన్న‌ట్లు తెలిపాయి. అయిన‌ప్ప‌టికీ రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోందన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంద‌ని ప్ర‌క‌టించింది.


logo