గురువారం 28 జనవరి 2021
National - Jan 02, 2021 , 11:21:19

బూటాసింగ్ మృతికి ప్ర‌ధాని మోదీ సంతాపం

బూటాసింగ్ మృతికి ప్ర‌ధాని మోదీ సంతాపం

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ హోంమంత్రి బూటాసింగ్ మృతికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం తెలియ‌జేశారు. బూటాసింగ్ మ‌ర‌ణ‌వార్త త‌న‌ను ఎంతో బాధించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన ప‌రిపాల‌కుడ‌ని ప్ర‌ధాని కొనియాడారు. పేద ప్ర‌జ‌ల సంక్షేమం, అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం బూటాసింగ్ గ‌ట్టిగా గ‌ళం వినిపించేవార‌ని గుర్తుచేశారు. బూటాసింగ్ కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న అభిమానుల‌కు, మ‌ద్దతుదారుల‌కు ప్ర‌ధాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo