శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 21:31:13

వ్యవసాయ బిల్లులను అమలు చేయం : మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి

వ్యవసాయ బిల్లులను అమలు చేయం : మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ బిల్లులను రాష్ట్రంలో అమలుచేయమని మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ తోరట్‌ చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లులను "రైతు వ్యతిరేక" బిల్లులు అని పేర్కొన్న తోరట్‌.. కలిసి కూర్చుని ఒక వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు. రేపు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసి విన్నవిస్తుందని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు- 2020, రైతుల (సాధికారత మరియు రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు- 2020, ముఖ్యమైన వస్తువుల (సవరణ) బిల్లు- 2020 పై సంతకం చేశారు.

ఎన్డీఏ పాత మిత్రుడైన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కూడా ఈ వ్యవసాయ బిల్లులను సమర్థించడంలేదు. ఈ బిల్లుల విషయంలో విడిపోయారు. అంతకుముందు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి, ఎస్ఏడీ నాయకురాలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సెప్టెంబర్ 17 న కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగారు. ఈ చట్టాలు పంజాబ్‌లోని వ్యవసాయరంగాన్ని నాశనం చేస్తాయి అని హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ పేర్కొన్నారు.

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి వైదొలగాలని ఎస్‌ఏడీ తీసుకున్న నిర్ణయాన్ని శివసేన స్వాగతించింది. “రెండు పార్టీలు (శివసేన, ఎస్‌ఏడీ) చాలాకాలంగా బీజేపీకి అండగా నిలిచాయి. గత ఏడాది ఎన్‌డీఏ నుంచి వైదొలగాల్సి ఉండగా.. అకాలీదళ్ ఇప్పుడు వ్యవసాయ బిల్లుల కారణంగా ఎన్డీఏ నుంచి తప్పుకుంది” అని శివసేన సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌రౌత్‌ తెలిపారు.  ఇదిలావుండగా, కిసాన్ మార్చ్‌ మూడు తఖ్త్‌ల నుంచి అక్టోబర్ 1 న ప్రారంభమవుతుందని, మొహాలికి వెళ్తామని ఎస్ఏడీ అధ్యక్షుడు బాదల్ చెప్పారు. ఈ మూడు ఆర్డినెన్స్‌లకు అనుమతి ఇవ్వకూడదని, ప్రభుత్వం వీటిని తిరిగి తీసుకోవాలని గవర్నర్, రాష్ట్రపతికి మెమోరాండం ఇస్తాం" అని ఆయన తెలిపారు.