శుక్రవారం 29 మే 2020
National - Apr 08, 2020 , 21:18:57

ఫేస్ మాస్కులు పెట్టుకోవాల్సిందే :మ‌నీశ్ సిసోడియా

ఫేస్ మాస్కులు పెట్టుకోవాల్సిందే :మ‌నీశ్ సిసోడియా

న్యూఢిల్లీ: స‌ద‌ర్ ప్రాంతంలో కొన్ని క‌రోనా పాజిటివ్ కేసుల‌ను గుర్తించామ‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా 20 హాట్ స్పాట్ల‌ను గుర్తించాం. ఈ ప్రాంతాల్లోకి  ఎవ‌రైనా వెళ్లడం కానీ, అక్క‌డ నుంచి ఎవ‌రూ బ‌య‌టికి రావ‌డం కానీ నిషేధించామ‌ని చెప్పారు.

ఢిల్లీ ప్ర‌జ‌లు బ‌య‌టకు వ‌చ్చిన‌పుడు..ఫేస్ మాస్కులు త‌ప్పనిస‌రిగా పెట్టుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించ‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు 576 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించేలా ఢిల్లీ పోలీసులు గ‌స్తీ కొన‌సాగిస్తున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo