శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 14:35:28

చేతులు జోడించి సోనియాకు దండం పెడుతున్నా..

 చేతులు జోడించి సోనియాకు దండం పెడుతున్నా..

హైద‌రాబాద్‌: వ‌ల‌స కూలీల అంశంపై అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను కోరారు.  ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ వ‌ల‌స కూలీల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే అంశంలో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి నిర్మ‌ల‌.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రెండు చేతులు జోడించి దండం పెడుతూ..  వ‌ల‌స కూలీల అంశం ప‌ట్ల‌ మ‌రింత బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలన్నారు.  వ‌ల‌స కూలీల గురించి మాట్లాడాల‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సోనియాను కోరుతున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.  



logo