శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 13:59:18

ఈ ఎలుగుబంటిని మెచ్చుకోవాల్సిందే..వీడియో

ఈ ఎలుగుబంటిని మెచ్చుకోవాల్సిందే..వీడియో

అది నిత్యం వాహ‌న రాక‌పోక‌లు జ‌రిగే రోడ్డు. ఎంతోమంది వాహ‌నాల్లో ఆ రోడ్డుపై నుంచి వెళ్లారు. కానీ రోడ్డు క్రాసింగ్ ద‌గ్గ‌రున్న సైన్ బోర్డు (రోడ్డు ‌ప‌‌నులు జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో వాడేది) కింద ప‌డింది. ఆ బోర్డును ఎవ‌రూ స‌రిచేయ‌లేదు.

ఇంతలో అదే రోడుపై ఓ ఎలుగుబంటి ద‌ర్జాగా న‌డుచుకుంటూ వ‌చ్చింది. ట‌ర్నింగ్ ద‌గ్గ‌రున్న బోర్డును నోరు, కాలి సాయంతో నిల‌బెట్టి త‌న దారిన తాను వెళ్లిపోయింది. ఎలుగుబంటి సైన్ బోర్డు ను సెట్ చేస్తూ వెళ్లిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మంచి ప‌ని చేసిన ఎలుగుబంటిని మెచ్చుకోవాల్సిందే. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo