సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 10:36:53

ఇవాళ ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల దినోత్స‌వం

ఇవాళ ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల దినోత్స‌వం

హైద‌రాబాద్‌: ట్రిపుల్ త‌లాక్ బిల్లు పార్ల‌మెంట్‌లో పాసై నేటికి ఏడాది. ఈ నేప‌థ్యంలో ముస్లిం మ‌హిళ‌ల హ‌క్కుల దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నారు.  కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌, కేంద్ర మ‌హిళా, శిశుఅభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీలు ఇవాళ వ‌ర్చువ‌ల్ స‌మావేశం ద్వారా ముస్లిం మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. 2019, జూలై 30వ తేదీన ట్రిపుల్ త‌లాక్ బిల్లు పాసైంద‌ని, ట్రిపుల్ త‌లాక్‌ను మోదీ ప్ర‌భుత్వం బ్యాన్ చేసింద‌ని, దీంతో మ‌హిళా సాధికార‌త పెరిగింద‌ని, మ‌హిళ‌ల‌కు స‌మాజంలో గౌర‌వం పెరిగింద‌ని కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టం చేసిన త‌ర్వాత కేసులు 82 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. 

  


logo