సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 22:32:13

రాఖీల తయారీలో ముస్లిం మహిళలు

రాఖీల తయారీలో ముస్లిం మహిళలు

వారణాసి : ఉత్తరప్రదేశ్లో రక్షాబంధన్‌కు ఇక్కడి ముస్లిం మహిళల బృందం శ్రీరాముడు, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరుల ఫొటోలతో రాఖీలు తయారు చేస్తున్నారు. 'మోదీ భయ్యా' అంటూ పాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతుతో సహా వివిధ సందేశాలతో రాఖీలను సిద్ధం చేయడం కనిపించింది. విశాల్ భారత్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇక్కడి ముస్లిం మహిళలు ఆయనకు రాఖీలు పంపుతున్నారని తెలిపారు. విడాకుల చట్టంలో తమకు సాయం చేయాలని ముస్లిం మహిళలు విజ్ఞప్తి చేయడంతో ప్రధాని ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలు మోడీని తండ్రిగా, సోదరుడిగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.
logo