శనివారం 28 మార్చి 2020
National - Feb 20, 2020 , 16:50:31

మఠాధిపతిగా మారనున్న ముస్లిం వ్యక్తి

మఠాధిపతిగా మారనున్న ముస్లిం వ్యక్తి

కర్ణాటక: సాధారణంగా హిందువులను బలవంతంగా ఇతర మతాల్లోకి మార్పించడం చూస్తుంటాం. మతమార్పిడి చేసుకున్నవారిలో స్వచ్చందంగా మారిన వారిని వెతికితే చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి తాజాగా హిందూమతంలోకి మారాడు. కర్ణాటకలోని గడగ్‌ ప్రాంతానికి చెందిన దేవాన్‌ షరీఫ్‌ ముల్లా మురుగ రాజేంద్రమఠ్‌లో ‘ఇష్ట లింగ ధరన్‌' వేసుకున్నారు. నేను ‘ఇష్ట లింగ ధరన్‌'  పూర్తి చేశా. ఈ పని చేయమని నన్నెవరూ అడగలేదు. సర్వశక్తిమంతుడు ధర్మమార్గంలో నడవాలని నా మనస్సుకు మార్గనిర్దేశనం చేశాడు. ప్రేమ, త్యాగం వంటి సందేశాలను నాకు హితోపదేశం చేసి..నాకు  బాధ్యత అప్పగించారని చెప్పుకొచ్చాడు. శ్రీ మురుగ రాజేంద్రకొరనేశ్వర స్వామి ఆధ్వర్యంలో మఠాధిపతిగా మారనున్నాడు. logo