సోమవారం 30 మార్చి 2020
National - Feb 18, 2020 , 00:05:44

చిన్నప్పుడు సంగీతం టీచర్‌ వేధించాడు!

చిన్నప్పుడు సంగీతం టీచర్‌ వేధించాడు!
  • అమెరికా నుంచి వచ్చి ఫిర్యాదు

ముంబై: పదేండ్ల కిందట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక యువతి చేసిన ఫిర్యాదుమేరకు ముంబైలో 55 ఏండ్ల వయసున్న సంగీతం టీచర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. 2007 నుంచి 2010 మధ్యకాలంలో ముంబై శివారుప్రాంతమైన అంధేరిలోని బాలిక నివాసంలో ఆమెకు నిందితుడు సంగీత పాఠాలు నేర్పేవాడు. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేండ్లు. ఆమెపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. 12 ఏండ్ల వయసులో బాలిక ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం ఆమెకు 21 ఏండ్లు. ఆదివారం స్వదేశానికి వచ్చిన ఆమె.. నిందితుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని ఓషివారా ఇన్‌స్పెక్టర్‌ దయానంద్‌ బంగర్‌ తెలిపారు. నిందితుడి కి స్థానిక న్యాయస్థానం సోమవారం బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. అతడు మిగతా పిల్లలపైనా వేధింపులకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 


logo