శుక్రవారం 15 జనవరి 2021
National - Nov 29, 2020 , 15:37:55

ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు అన్నం పెడుతున్న ముర్తాల్ దాబా

ఆందోళ‌న చేస్తున్న రైతుల‌కు అన్నం పెడుతున్న ముర్తాల్ దాబా

న్యూఢిల్లీ: అన్నం పెట్టే రైతుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం లాఠీ ఎత్తుతుంటే.. అక్క‌డి ఓ దాబా మాత్రం వాళ్ల‌కు అన్నం పెట్టి ఆక‌లి తీరుస్తోంది. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ రాజ‌ధానిలో నాలుగు రోజులుగా పంజాబ్ రైతులు ఆందోళ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్ని వేల మంది రైతులు నిర‌స‌న తెల‌ప‌డానికి ఢిల్లీ వ‌చ్చారు. ఇప్పుడు ఈ రైతుల‌కు హ‌ర్యానాకు చెందిన ఆమ్రిక్ సుఖ్‌దేవ్ దాబా ఆహారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. ముర్తాల్ దాబాగా పేరుగాంచిన ఈ దాబా వేల మంది రైతుల‌కు మూడు రోజుల పాటు ఆహారం అందించ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ దాబాలో రైతులు భోజనం చేస్తున్న వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇండియా యూత్ కాంగ్రెస్ ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌భుత్వ అనుమ‌తి మేర‌కు 400 మంది రైతులు త‌మ‌కు కేటాయించిన బురారీ ప్రాంతంలో నిర‌స‌న తెలుపుతుండ‌గా.. మ‌రికొన్ని వేల మంది మాత్రం సింఘు, టిక్రీ ప్రాంతాల్లోనే నిర‌స‌న తెలుపుతున్నారు.