శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 30, 2020 , 12:54:20

అది హిందుత్వ‌పై దాడి: శివ‌సేన

అది హిందుత్వ‌పై దాడి: శివ‌సేన

ముంబై: ‌బీహార్ రాష్ట్రం ముంగార్ జిల్లాలో దుర్గామాత విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా పోలీసులు, ఉత్స‌వాల్లో పాల్గొన్న‌వారికి మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లు, కాల్పుల ఘ‌ట‌న‌ను హిందూత్వ‌పై దాడిగా శివ‌సేన ఎంపీ, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లు ఎన్‌డీఏ పాలిత రాష్ట్ర‌మైన బీహార్‌లో చోటుచేసుకున్నాయి కాబట్టి అక్క‌డి గ‌వ‌ర్న‌ర్‌గానీ, బీజేపీ నేత‌లుగానీ నోరు మెద‌ప‌డం లేద‌ని రౌత్ విమ‌ర్శించారు. అదే మ‌హారాష్ట్ర‌లోనో, ప‌శ్చిమ‌బెంగాల్‌లోనో, రాజ‌స్థాన్‌లోనో, బీజేపీ ప్ర‌భుత్వ భాగ‌స్వామిగా లేని మ‌రో రాష్ట్రంలోనో జ‌రిగితే ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

బీజేపీ పాల‌న‌లో లేని రాష్ట్రాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటే ఆ పార్టీ నేత‌ల‌తోపాటు, ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు రాష్ట్రప‌తి పాల‌న కోసం డిమాండ్ చేసేవార‌ని సంజ‌య్ రౌత్ మండిప‌డ్డారు. మ‌రి ఇప్పుడు బీహార్ గ‌వ‌ర్న‌ర్‌, బీహార్ బీజేపీ నేత‌లు ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.