మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 10:08:25

ముంబై తాజ్ హోట‌ల్‌ను బాంబుల‌తో పేల్చేస్తాం..

ముంబై తాజ్ హోట‌ల్‌ను బాంబుల‌తో పేల్చేస్తాం..

హైద‌రాబాద్‌:  ముంబైలో ఉన్న ప్ర‌ఖ్యాత తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది.  దీంతో హోట‌ల్ వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.  పాకిస్థాన్‌లోని క‌రాచీ నుంచి ఆ ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు.  బాంబుల‌తో హోట‌ల్‌ను పేల్చివేస్తామ‌ని బెదిరించిన‌ట్లు ముంబై పోలీసులు చెప్పారు. ఈ నేప‌థ్యంలో హోట‌ల్‌తో పాటు స‌మీప ప్రాంతాల్లోనూ భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు. క‌రాచీలో నిన్న స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే.  ఆ దాడికి పాల్ప‌డిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి. 

ఇవాళ అర్థ‌రాత్రి 12.30 నిమిషాల‌కు ఈ ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.  2008లో తాజ్‌హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే.  ఆ ఉగ్ర‌దాడిలో 166 మంది మృతిచెందారు. 300 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. పాక్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు ఆ దాడికి ప్లానేశారు.


logo