బుధవారం 15 జూలై 2020
National - Jul 01, 2020 , 09:28:41

లాల్‌ బాగుచా గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించం

లాల్‌ బాగుచా గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించం

ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. ఆ రాష్ట్ర రాజధాని ముంబైని కరోనా గజగజ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించమని లాల్‌ బాగుచా రాజా గణేశ్‌ ఉత్సవ్‌ మండల్‌ కమిటీ తెలిపింది. గణేశ్‌ ఉత్సవాలను నిర్వహించే ప్రాంతంలో రక్తం, ప్లాస్మా దానం క్యాంపులను ఏర్పాటు చేస్తామని చెప్పింది. గతేడాది చంద్రయాన్‌-2 ఆకారంలో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. 


logo