మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 19:31:43

న‌డిరోడ్డు మీద కారెక్కి భ‌ర్త‌ని చెప్పుతో కొట్టిన మ‌హిళ : వీడియో వైర‌ల్‌

న‌డిరోడ్డు మీద కారెక్కి భ‌ర్త‌ని చెప్పుతో కొట్టిన మ‌హిళ :  వీడియో వైర‌ల్‌

ముంబైలో ట్రాఫిక్ అంత‌రాయం క‌లిగిందంటే దానికి పెద్ద కార‌ణ‌మే ఉంటుంది. అయితే ఈ అంత‌రాయానికి కార‌ణం ఒక మ‌హిళ‌నే. నాలుగు గోడ‌ల మ‌ధ్య ర‌హ‌స్యంగా ఉండాల్సిన భార్యాభ‌ర్త‌ల గొడ‌వ ఇలా రోడ్డు మీద‌కి వ‌చ్చింది. భ‌ర్త‌ని చొప్పుతో కొట్టిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ముందుగా వెళ్తున్న భ‌ర్త కారు ట్రాఫిక్‌లో ఆగింది. వెంట‌నే వెనుక‌వైపు తెల్ల‌కారులో వ‌స్తున్న మ‌హిళ కారు దిగి భ‌ర్త‌ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేసింది. అత‌ను బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో కారెక్కి హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఈ త‌మాషా చూడ‌డానికి ఎక్క‌డివారెక్క‌డ ఆగిపోవ‌డంతో ట్రాఫిక్ జామ్ అయింది. మ‌హిళ కారు రోడ్డు మీద వ‌దిలేసినందునందుకు పోలీసులు జ‌రిమానా కూడా విధించారు. ఈ గొడ‌వ నుంచి ఆమెను వెన‌క్కి లాగేందుకు పోలీసులు చాలా ప్ర‌య‌త్నించార‌ని గామ్‌దేవి పోలీస్ స్టేష‌న్ సీనియ‌ర్ పోలీస్ ఇన్స్పెక్ట‌ర్ రాజేంద్ర మోహిత్ చెప్పుకొచ్చారు. ట్రాఫిక్‌లో ఉన్న కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారు.
logo