మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 17:30:16

క‌రోనా కేసులు.. చైనాను అధిగ‌మించిన ముంబై

క‌రోనా కేసులు.. చైనాను అధిగ‌మించిన ముంబై

ముంబై : ‌చైనాలోని వుహాన్ న‌గ‌రంలో  ఉద్భ‌వించిన క‌రోనా మ‌హ‌మ్మారి.. త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ దేశాల‌కు వ్యాపించింది. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. క‌రోనా పుట్టిన చైనాలో కేసులు త‌క్కువ సంఖ్య‌లో న‌మోదైతే.. మిగ‌తా దేశాల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్య‌ధిక సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. చైనాలో న‌మోదైన కేసులు.. ఒక్క ముంబై న‌గ‌రంలోనే న‌మోదు కావ‌డం విశేషం. కాగా, కరోనా కేసుల్లో భారత్‌ శరవేగంగా రష్యాను దాటేసి ఆదివారం మూడో స్థానానికి చేరింది. 

అధికారిక లెక్క‌ల ప్ర‌కారం.. ముంబైలో ప్ర‌స్తుతం 85,724 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 4,938 మంది మ‌ర‌ణించారు. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 83,565 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,634 మర‌ణాలు సంభ‌వించాయి. చైనాలో ఒక్క‌రోజు న‌మోదైన కేసులు.. ముంబైలోని ధార‌వి స్ల‌మ్ ఏరియాలో న‌మోదు అయ్యాయి. ముంబై వ్యాప్తంగా జులై ఒక‌టో తేదీ నుంచి ప్ర‌తి రోజు 1,100 కేసుల‌కు త‌గ్గ‌కుండా న‌మోదవుతున్నాయి. 


logo