రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకులముందుకురానుంది. ఉగాది సందర్భంగా కథానాయిక సాయిపల్లవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మామిడితోరణాలతో, బంతిపూల మాలలతో పండుగ శోభను ప్రతిబింబిస్తున్న దర్వాజ ముందు కూర్చొని గడపకు పసుపుకుంకుమలు అద్దుతూ..సంప్రదాయ వస్ర్తాల్లో అచ్చ తెలంగాణ పడతిగా సాయిపల్లవి దర్శనమిస్తోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. 1990ల నేపథ్యంలో నక్సలైట్ నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి, నందితాదాస్, నివేదా పేతురాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం: సురేష్ బొబ్బిలి, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.