శనివారం 19 సెప్టెంబర్ 2020
National - Jul 17, 2020 , 08:55:33

23 ఏళ్ల తర్వాత వజ్రాల స్మగ్లర్‌ను పట్టుకున్న ముంబై పోలీసులు

23 ఏళ్ల తర్వాత వజ్రాల స్మగ్లర్‌ను పట్టుకున్న ముంబై పోలీసులు

ముంబై : వజ్రాలు, బంగారం స్మగ్లింగ్ చేసి పరారీలో ఉన్న వాంటెడ్ స్మగ్లర్‌ను 23 ఏళ్ల తర్వాత ముంబై పోలీసులు పట్టుకున్నారు. ముంబై నగరానికి చెందిన హరీష్ కల్యాణ్ దాస్ భావసర్ అలియాస్ పరేష్ ఝావేరీ వజ్రాలు, బంగారం స్మగ్లర్. 53 ఏళ్ల హరీష్ కల్యాణ్ 130 కోట్ల రూపాయల పన్ను ఎగవేశాడు. దీంతో 1997లో ఇతనిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. హరీష్ కల్యాణ్ సింగపూర్ నుంచి ముడి బంగారం, వజ్రాలను దిగుమతి చేసుకొని పన్ను ఎగవేశాడు.

దీంతో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న హరీష్‌ను ముంబై పోలీసులు 23 ఏళ్ల తర్వాత అరెస్టు చేశారు. హరీష్‌పై బంగారం, వజ్రాల స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo