సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:34:11

బీహార్ పోలీసుల ద‌ర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారు...

బీహార్ పోలీసుల ద‌ర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నారు...

పాట్నా: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం కేసుపై బీహార్ పోలీసులు జ‌రుపుతున్న న్యాయమైన ‌ద‌ర్యాప్తును ముంబై పోలీసులు అడ్డుకుంటున్నార‌ని బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. త‌మ రాష్ట్ర పోలీసుల ద‌ర్యాప్తున‌కు ముంబై పోలీసులు స‌హ‌క‌రించ‌డంలేద‌ని ఆయ‌న విమర్శించారు. ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐకి అప్ప‌గించాల‌ని బీజేపీ కోరుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ట్వీట్ చేశారు. 

కాగా, సుశాంత్ మ‌ర‌ణం కేసు రోజుకో మలుపు తిరుగుతున్న‌ది. మ‌రికొన్ని నెల‌ల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈ కేసున‌కు రాజ‌కీయ రంగు పులుముకున్న‌ది. మహారాష్ట్ర‌, బీహార్ రాష్ట్రాల‌తో ముడిప‌డి ఉన్న సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని ఇరు రాష్ట్రాల‌కు చెందిన బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే స్పందించ‌క‌పోవ‌డంపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు.logo