బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 09:21:56

మూడింటికీ ఒకేరోజు బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌

మూడింటికీ ఒకేరోజు బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే హ‌నీ, మాయ‌, విస్కీ అనే మూడు కుక్క‌ల‌కు ఘ‌నంగా బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపారు ముంబై పోలీసులు. సెల‌బ్రేష‌న్స్ వీడియోల‌ను పోలీసులు ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందులో మూడు కుక్క‌లు మూడు కేకుల‌తో క‌నిపించాయి. ఒక్కొక్క‌దానికి ఒక్కో కేకు చొప్పున అరేంజ్ చేశారు. అంతేకాదు ఈ మూడు కుక్క‌ల‌కు మెడ‌లో బ‌ర్త్‌డే పింక్ సాష్ కూడా ధ‌రించారు. ఆ గ‌దిని బెలూన్ల‌తో, హ్యాపీ బ‌ర్త్‌డే అని రాసిన‌ బ్యాన‌ర్ క‌ట్టి అలంక‌రించారు.

పిల్ల‌ల మొద‌టి పుట్టిన‌రోజును ఎంత ఘ‌నంగా అయితే చేస్తారో అచ్చం అలానే చేశారు. 'పోయిన ఏడాది ఆగ‌స్టులో మాకు ఈ చిన్న కుక్క‌పిల్ల‌ల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చిన ర‌క్షిత మెహ‌తా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముంబైక‌ర్ల భ‌ద్ర‌త‌ను కాపాడ‌డానికి ఇవి ముందుంటాయి. వీటికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండి' అనే సందేశంతో ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ కుక్క‌లు శిక్షణ తీసుకుంటున్నాయి. త్వరలో నగరాన్ని రక్షించే బాధ్యతను స్వీకరిస్తాయి. ఈ వీడియో చాలా త్వ‌ర‌గా వైర‌ల్‌గా మారింది. అంతేకాదు, 17.2కే మంది వీక్షించారు. 

  


logo